రాయదుర్గం: టి. వీరాపురం గ్రామంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామంలో శివకుమార్ (20) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలిపనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉన్న ఇతను ఆదివారం తెల్లవారుజామున ఎవరూ లేని పాత ఇంటిలో ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సురేష్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆ యువకుడి ఆత్మహత్యకు కారణమని తెలిసింది. ఐతే పూర్తి సమాచారం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.