కళ్యాణదుర్గం: నకిలీ మద్యంపై నిరంతరం నిఘా వేయాలి: కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
నకిలీ మద్యంపై నిరంతరం నిఘా వేయాలని స్థానిక ఎక్సైజ్ పోలీస్ అధికారులను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య ఆదేశించారు. కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్ణాటక మద్యం రవాణా కాకుండా చూడాలన్నరు. మద్యం బెల్ట్ షాపులు ఉండకూడదన్నారు. సారా తయారీ, రవాణా, విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.