మార్కాపురం: జిల్లా కేంద్రంలో పొన్న వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనం
మార్కాపురం జిల్లాలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున మురళీకృష్ణ అలంకారంలో పొన్న వాహనంపై చెన్నకేశవ స్వామిని పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు మహిళలు కోలాటంతో భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.