కొండపి: కొండపి పొగకు వేలం కేంద్రంలో అత్యధికంగా తిరస్కరణలకు పొగకు బెల్లు తిరస్కరణ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలంపాటలో రైతులు ఆర్థికంగా నష్టపోయినట్లు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు డిమాండ్ తగ్గడం జీఎస్టీ ధరలు పెరగడం వంటి అంశాలు పొగకు ధరలపై ప్రభావం చూపిస్తుందని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా వేలం కేంద్రంలో ఈరోజు 100 పొగాకు బేళ్లు తీసుకురాగా అందులో 40 శాతానికి పైగా తిరస్కరణలు జరిగినట్లు రైతులు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.