కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు తొలగించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ ఇచ్చిన లైటులను కాకుండా వాహనదారుల ఏర్పాటు చేసుకున్న ఎల్ఈడీ లైట్లు పోలీసులు తొలగించారు. ఈ ఎల్ఈడి లైట్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన నేపథ్యంలో ఈ లైట్లను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.