యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం నెరజాముల తండా వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీటెక్ విద్యార్థి అజయ్
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం నరజాముల తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్ పై వెళుతున్న బీటెక్ విద్యార్థి ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అజయ్ ని ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మరో యువకుడికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.