యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం నిర్వాసితులు
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా నిర్వాసితులు కోరుతున్నారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన నిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం తమ భూములు ఇండ్లను త్యాగం చేశామని చెప్పారు. తమకు పూర్తిస్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. చాలామంది నిర్వాసితులు గెజిట్లో పేరు ఉండి కూడా లబ్ధి పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని వేడుకున్నారు.