మార్కాపురం: జిల్లా కేంద్రంలో శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనం
మార్కాపురం జిల్లాలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గురువారం తెల్లవారుజామున శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై చెన్నకేశవ స్వామిని పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు మహిళలు కోలాటంతో భక్తులను ఆకట్టుకున్నారు.