యర్రగొండపాలెం: తమకు న్యాయం చేయాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్దారవీడు మండలం సుంకేసుల వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టు కోసం స్థలాలు భూములు ఇచ్చిన ముంపు గ్రామస్తులకు అన్యాయం జరిగిందన్నారు. తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో పేరు లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని 20 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న న్యాయం చేయలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.