యర్రగొండపాలెం: స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య కార్మికులు కృషి చేయాలి : ఎంపీపీ వెంకటయ్య
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ట్రై సైకిళ్లు ట్రాక్టర్ ట్రక్కులు మండలంలోని అన్ని గ్రామాలకు పంపిణీ చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య కార్మికులు కృషి చేయాలని ఎంపీపీ వెంకటయ్య పిలుపునిచ్చారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మరియదాసు తదితరులు పాల్గొన్నారు.