కొండపి: సింగరాయకొండ రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి,దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థానానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొదట భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా పిల్లలు కూడా వారిని చూసి రైలు కింద పడినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.