యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డులు, అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారుడు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిధిలోని పెట్రోల్ బంకులను శనివారం పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దూరప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ ఉన్న వాహనదారుల తాకిడితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యుద్ధం పేరుతో పెట్రోల్ బంకుల నిర్వాహకులు స్టాక్ లేదని చెబుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని డీజిల్ పెట్రోల్ దొరికేలా చూడాలని కోరుతున్నారు.