రాయదుర్గం: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం రెగ్యులర్ చేయండయ్యా అంటూ ఎమ్మెల్యే ను వేడుకున్న మున్సిపల్ కార్మికులు
"ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయండయ్యా" అంటూ మున్సిపల్ పారిశుద్ధ్య ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును వేడుకున్నారు. యూనియన్ పిలుపు మేరకు సోమవారం ఉదయం రాయదుర్గంలోని ఆయన నివాసానికి యూనియన్ జెండాలు చేతబట్టి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యేను కలిసి తమ తమ సమస్యను విన్నవించారు. చాలీచాలని జీతాలు తీసుకుంటున్న తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని కార్మికులు వివరించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తమకు ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంట్, ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.