యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి బయలుదేరిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్నారు. ముందుగా శ్రీశైలం సమీపంలో కొల్లం వాగు వద్ద వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి బోటులో బయలుదేరారు. అనంతరం ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు