యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ఖాతాకు నిధులు జమ
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వారి ఖాతాలో పడుతున్నాయి అన్నారు. జూన్ 27వ తేదీ సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పర్యటనలో 300 కోట్లు నిర్వాసితుల ఖాతాలో వేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో నిర్వాసితుల ఖాతాలో 12 లక్షల 50 వేల నుంచి 12 లక్షల 76 వేల వరకు నిధులు జమ అవుతున్నాయి అన్నారు. మరికొందరికి రాలేదని ఎదురుచూస్తున్నారు