మార్కాపురం: వేములపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపు బోరును తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి
మార్కాపురం మండలం వేములపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో చేతి పంపు బోర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాఠశాలకు ముందు భాగంలో ఉండడం వల్ల విద్యార్థులు చేతులు అందులో వేసుకొని ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు వాపోయారు. నీరు రాక నిరుపయోగంగా ఉన్న వాటిని తొలగించి విద్యార్థులు ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు