కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రం లో నిరాశ జనకంగా ముగిసిన వేలం, కేవలం 275 పొగాకు బెల్లు కొనుగోలు చేసిన నిర్వాహకులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకువేలం కేంద్రంలో బుధవారం గుర్రప్పడియ, కే అగ్రహారం సతుకుపాడు, మూగచింతల గ్రామాలకు చెందిన రైతులు 1130 పొగాకు బేళ్లు అమ్మకానికి పెట్టగా 275 బెళ్ళు మాత్రమే కొనుగోలు చేశారు. మూడవ రౌండ్ కొనసాగుతున్నప్పటికి తిరస్కరణల సంఖ్య ఆగకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగటు ధర 192.66 రూపాయలుగా నమోదయిందని వేలంకేంద్రం అధికారులు తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది పొగాకు రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది.