గిద్దలూరు: అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఇంటి ముందు శుభ్రం చేసే విషయంలో వివాదం తలెత్తి ఘర్షణ పడగా ముగ్గురు గాయాల పాలయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గొడవకు కారణమైన ఇరు కుటుంబాల కో చెందిన మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.