రాయదుర్గం: దేవగిరి గ్రామంలో అంబేడ్కర్ చిత్రపటం ఊరేగింపులో ఉద్రిక్తత
బొమ్మనహాల్ మండలంలోని దేవగిరి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్రపటం ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం ఎస్సీ కాలనీ యువకులు ఊరేగింపు చేశారు. బొడ్రాయి మీదుగా ఊరేగింపు రాకూడదని స్థానికులు వారి ఊరేగింపు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గతంలో ఊరేగింపు వెళ్లే దారిలో అలాగే వెళ్లాలని సూచించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.