యర్రగొండపాలెం: రాచకొండ గ్రామంలో రామాలయం ప్రతిష్ట ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామంలో రామాలయంలో విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.