ఉరవకొండ: ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేల వాలిన మొక్కజొన్న అరటి పంటలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప, జీడిపల్లి, బెళుగుప్ప గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న అరటి పంటలు నేలవాలాయి. బెలుగుప్ప మండలంలో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి పృథ్వి సాగర్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు పేర్కొన్నారు. మండలంలోని జీడిపల్లి, గంగవరం, బెళుగుప్ప గ్రామాల్లో మొక్కజొన్న, అరటి పంటలు నష్టపోయిన రైతులు పంట నష్ట పరిహారం చెల్లించాలని వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులకు తెలియజేశారు.