రాయదుర్గం: రీ సర్వే పక్కాగా చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
రీ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం బొమ్మనహాల్ మండలంలోని కొలగానహళ్లి, ఏళంజి గ్రామాలలో జరుగుతున్న రీ సర్వే ను పర్యవేక్షించారు. అనంతరం సచివాలయం తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని, ప్రజా పిర్యాదుల పరిష్కారానికి ఆధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బంది కి సూచించారు. అలాగే నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ మునివేలు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.