కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి అనుమానస్పద మృతి, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఓ ప్రైవేటు స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన తౌషిక్ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. పునఃవిచారణలో భాగంగా పోలీసులు మొత్తం 13 సెల్ఫోన్లను సీజ్ చేశారు. పాఠశాలకు సంబంధించిన వారి ఫోన్లు, సింగరాయకొండ పోలీసుల ఫోన్లో సైతం స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా కేసు ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉంది. తల్లితండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విద్యార్థులు ఈ కేస్ పై మరోమారు విచారణ చేపట్టారు.