కళ్యాణదుర్గం: భావితరాలు సైతం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య
కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడారు.భారత రాజ్యాంగాన్ని రాయడంతో పాటు దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. భావితరాలు సైతం ఆయన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.