కొండపి: సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ లో బంగారం,వెండి, నగదు ఉన్న బ్యాగును దొంగలించారని పోలీసులను ఆశ్రయించిన మహిళ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో బుధవారం ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ దొంగలు దొంగలించారని ఫిర్యాదు చేసింది. ఉలవపాడు మండలం కు చెందిన రమణమ్మ సింగరాయకొండకు పనిమీద వచ్చింది హ్యాండ్ బ్యాగ్ తో పాటు బ్యాగులో ఉన్న ఐదు సవర్ల బంగారం, 17 తులాల వెండి రూ.40 వేలు నగదు దొంగలు అపహరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.