రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 75 వీరాపురం తాజా మాజీ సర్పంచ్ నాగరాజు, టిడిపి సీనియర్ నేత సత్యనారాయణ
గుమ్మగట్ట మండలంలోని 75 వీరాపురం తాండా వద్ద బైక్, ఆటో డీకొన్న ఘటనలో వీరాపురం తాజా మాజీ సర్పంచ్ నాగరాజు, టిడిపి సీనియర్ నేత సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మద్యాహ్నం రాయదుర్గం నుండి స్వగ్రామానికి బైక్ పై వెళుతుండగా ఎదురుగా గోనబావి గ్రామానికి చెందిన ఆటో వచ్చి వీరి బైక్ ను డీకొనింది. ఈ ప్రమాదంలో గాయపడిన వీరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. నాగరాజు తలకు బలమైన గాయాలు అయ్యాయి.