దర్శి: దర్శి ముండ్లమూరు మండలాలలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఈ ఆర్ ఓ శాంతిలక్ష్మి
Darsi, Prakasam | Jun 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి ముండ్లమూరు మండలాలలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఈఆర్ఓ శాంతిలక్ష్మి పరిశీలించారు. మండలాల్లోని పలు బూతుల్లో జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఎవరు నిర్లక్ష్యం వహించిన అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముండ్లమూరు ఎమ్మార్వో రజిని కుమారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.