రాయదుర్గం: కణేకల్లు వద్ద ఆగిఉన్న క్రేన్ ను డీకొన్న కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు
కణేకల్లు క్రాస్ నుంచి కణేకల్లు వెళ్లే రోడ్డులో ఆలూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పైప్‌లైన్ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్ రోడ్డు పక్కన నిలిపి ఉండగా, అతివేగంగా వచ్చిన కారు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.