రాయదుర్గం: రాష్ట్ర అభివృద్ధి కి సిఎం అహర్నిశలు కృషి : నేమకల్లులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో కలిసి రూ.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి రవికుమార్ మాట్లాడారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు నియోజకవర్గానికి పవర్ సబ్ స్టేషన్, మూడు విద్యుత్ సబ్-స్టేషన్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేస్తామని, ఎక్కడా లో-వోల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.