కళ్యాణదుర్గం: ఈనెల 20న సీఎం జన్మదినం సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి: కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకులు
కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన పురస్కరించుకుని ఈ నెల 20న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. ప్రజా వేదికలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బసవతారకం, రెడ్ క్రాస్ ఆసుపత్రుల నిర్వాహకులు హాజరవుతారన్నారు.దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.