విశాఖపట్నం: విశాఖపట్నంలో భారీగా పోర్టు అభివృద్ధి పనులు: మంత్రి సోనోవాల్ ప్రారంభోత్సవం
విశాఖపట్నం పోర్టులో పోర్ట్ ప్రొమెనేడ్, ఎస్టీపీ పెంపుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. విశాఖ అభివృద్ధిలో భాగంగా 18 కోట్ల రూపాయల ఎస్ఎల్ కెనాల్ పనులను కూడా చేపట్టారు.