మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం కాలేజీ రోడ్డులో వన్ స్టేట్ వన్ క్లిన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు