కొండపి: పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో శనివారం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి స్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు అధికారులు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ సత్య పాల్గొన్నారు. మేము పేదలకు మంచి చేస్తుంటే వైసిపి ఓర్వలేక కోర్టులలో కేసులు వేస్తుందని మంత్రి ఆరోపించారు.