మార్కాపురం: సర్ కార్యక్రమం గడువును పొడగించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ సర్ కార్యక్రమం గడువును పొడగించాలని కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల మంది కి డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది రేపటితో గడువు పూర్తవుతుంది. దీంతో మూడు లక్షల మంది ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి వార్డులో 400 పెండింగ్లో ఉన్నాయి. దీంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. సర్ కార్యక్రమం గడువు మూడు నెలలు పాటు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయమని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.