తాడిపత్రి: విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్ల ను బిగించకూడదని పుట్లూరు మండలంలో సిపిఐ నేతల ఆందోళన
పుట్లూరులో విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి పెద్దయ్య డిమాండ్ చేశారు. ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. అనంతరం విద్యుత్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు.