మార్కాపురం: చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్థానిక ఎస్వికెపి కళాశాలలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కత్తిరించి పోటీలను ప్రారంభించారు. ఆరు పండ్లు సైజు విభాగం న్యూ కేటగిరి విభాగం సీనియర్ విభాగం కేటగిరీగ మూడు రోజులపాటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు వీధి బండ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు విభాగాలలో గెలుపొందిన ఎడ్ల జాతకు ప్రతి విభాగానికి ఏడు బహుమతులు ఉంటాయన్నారు.