రాయదుర్గం: పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన
రాయదుర్గం పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపారు. శుక్రవారం ఉదయం సున్నపు బట్టీల సమీప కాలనీ వాసులు వారం రోజులైనా నీరు రాలేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న DE సురేష్, AE నరసింహులు, వార్డు TDP ఇన్చార్జ్ రామాంజనేయులు తదితరులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.