కొండపి: సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి స్వామి పాల్గొని లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి వైసిపి ఓర్చుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందని మంత్రి తెలిపారు. అలానే ప్రతినెల 1వ తేదీ కల్లా లబ్ధిదారులకు పెన్షన్లను ప్రభుత్వం అందిస్తున్నట్టు అన్నారు.