గిద్దలూరు: కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో లారీ ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, లారీ ఢీకొని ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు కంభం పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ గా స్థానికులు గుర్తించి కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దిలీప్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.