రాయదుర్గం: ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన YSR : జయంతి కార్యక్రమంలో YCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి
సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల మనసుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం రాయదుర్గం పట్టణంలో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. బౌతికంగా ఆయన లేకపోయిన ఆయన చేపట్టిన సంక్షేమం ఇప్పటికీ చిరస్మరణీయం అన్నారు. ఆయన స్పూర్పితో తాను రాజకీయాల్లో క్రియాసీలకంగా పని చేస్తున్నట్లు తెలిపారు.