కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో శనివారం రాత్రి పేకాట ఆడుతున్న నలుగురిని ఎస్సై నాగమల్లేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.4,780 నగదును స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.