గిద్దలూరు: రాచర్ల మండలంలోని రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, భారీగా తరలివచ్చిన భక్తులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు స్వామివారి కల్యాణ మహోత్సవం రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. నీటి గుండంలో స్నానమాచారించి తలనీలాలు సమర్పించి అనంతరం నడక మార్గంగా మోకాళ్లపై నడుస్తూ స్వామివారికి మొక్కు తీర్చుకున్నారు. రేపు ఎల్లుండి తెప్పోత్సవం చక్రస్నాల కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. కోరిన కోరికలు ఇక్కడ నెరవేర్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు..