గిద్దలూరు: రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేసిన గ్రామస్తులు, గ్రామంలో గ్రామోత్సవం
వర్షాలు బాగా కురవాలని మార్కాపురం జిల్లాలో కప్పలకు పెళ్లి చేసిన సంఘటన జరిగింది. గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో గ్రామస్తులు కప్పలకు పెళ్లి చేశారు. వర్షాకాలం సమీపించిన వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు అందరు కలిసి కప్పలకు వివాహం జరిపించారు. గ్రామోత్సవం తరహాలో కప్పలను గ్రామం మొత్తం ఊరేగించి ఆలయంలో గంగమ్మకు నైవేద్యం సమర్పించారు. మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లా పెద్ద కలిసి ఈ వివాహ వేడుకలలో పాల్గొన్నారు. ప్రతి ఇంటి మహిళ కప్పలకు కుంకుమ, పసుపుతో పూజించి గంగమ్మతో స్వాగతం పలికారు.