దర్శి: దర్శి పట్టణంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, ఊపిరి పీల్చుకున్న స్థానికులు
Darsi, Prakasam | Apr 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుండి తీవ్రమైన ఎండ ఉక్కపోతతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారి విపరీతమైన ఉరుములు గాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షం పడడంతో కొంత ఉపశమనం లభించిందన్నారు.