గిద్దలూరు: గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో బురదమయంగా మారిన గ్రామ రహదారి, అవస్థలు పడుతున్న స్థానిక ప్రజలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో ప్రధాన రహదారి బురద మయంగా మారింది. చిన్నపాటి వర్షానికి గ్రామంలో రోడ్డు డ్రైనేజీ కాలవను తలపిస్తూ అవస్థలు పడుతున్నామని ప్రజలు తెలిపారు. గతంలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని ఈ రోడ్డులో నడిచేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి తమ ప్రాంతంలో రహదారి నిర్మించాలని కోరుతున్నారు.