రాయదుర్గం: పట్టణంలో ఘనంగా హేమారెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించిన రెడ్డి యువజన సంక్షేమ సంఘం
రాయదుర్గం పట్టణంలో రెడ్డి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గర్ల్స్ హైస్కూల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 42 మందికి కంటి ఆపరేషన్ల అవసరముందని గుర్తించి వారికి ఆపరేషన్లు చేయించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి మెమొంటోలు అందజేశారు.