యర్రగొండపాలెం: దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో విబి రాంజీ ఉపాధి పనులను ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో వి బి జి రాంజీ కార్యక్రమాన్ని టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల నుంచి 125 రోజులు ఉపాధి పని కల్పిస్తున్నట్లు తెలిపారు. 312 రూపాయలు కనీస దినసరి కూలీ లక్ష్యంగా సవరించిన వేతనాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.