మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో డివైడర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో హైదరాబాదు నుండి కనిగిరి కి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డివైడర్ను ఢీకొన్న సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం ఎంట్రన్స్ లోకి రాగానే సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తు వల్లే సంఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు ఆరోపించారు.