తాడిపత్రి: గంగాదేవి పల్లి లో అత్యంత ఘనంగా గంగాభవాని దేవికి విశేష పూజలు
తాడిపత్రి మండలం గంగాదేవి పల్లి లో వెలిసి ఉన్న గంగాభవాని దేవి ఆలయంలో ఆదివారం విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారిని రకరకాల పూలతో చక్కగా అలంకరించారు. భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తుల అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.