కొండపి: టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి స్వామి, కనీసం కేజీ రూ.200 కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి
ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి బుధవారం సందర్శించారు. పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరు ఆన్లైన్ మార్కెట్ వంటి అంశాలను పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా కనీసం కేజీ పొగాకు ధర రూ.200 కొనుగోలు చేసే విధంగా చూడాలని కొనుగోలుదారులకు మంత్రి తెలిపారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తుందని అంతర్జాతీయ మార్కెట్ కారణంగా పొగాకు ధరలు తగ్గినట్లు మంత్రి తెలిపారు.